అలర్ట్ : రాత్రి 7గంటల వరకే మెడికల్ షాపులు

హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్నం నేపథ్యంలో హైదరాబాద్‌ పశ్చిమ మండల ఔషధ దుకాణాల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో రాత్రి ఏడు గంటల వరకే మందుల దుకాణాలు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 15వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు.

మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో వారంపాటు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేయాలని దుకాణాల యజమానుల సంఘం నిర్ణయిచింది. సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌, బేగం బజార్‌, కోఠి ట్రూప్‌ బజార్‌, పాతబస్తీ లాడ్‌ బజార్‌లో ఎనిమిది రోజులపాటు దుకాణాలు మూసివేస్తారు.