లోకల్ బ్రాండ్’కు ఓటేసిన మెగా హీరో

చైనాతో భారత్ వైరం నేపథ్యంలో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు లోకల్ బ్రాండ్ కి ఓటేస్తున్నారు. ఇకపై చైనా వస్తువులని బహిష్కరించాలి. లోకల్ బ్రాండ్ లని కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. తాజాగా మెగా యంగ్ హీరో శిరీష్ కూడా ఇచే చెప్పారు. ట్విటర్‌ వేదికగా తాను కొనుగోలు చేసిన లోకల్‌ బ్రాండ్స్‌ ఫొటోలను షేర్‌ చేశారు.

“మొన్న నేను సూపర్ మార్కెట్లో అన్ని భారతీయ బ్రాండ్సే కొనుగోలు చేశాను . మనలో చాలామంది స్వదేశీ బ్రాండ్స్ వాడకానికి ఆసక్తి చూపించరు. కానీ, ఇకమీదట అలా కాదు. లోకల్ బ్రాండ్స్ వాడదాం. ఆ విషయాన్ని పైకి చెప్పుకుందాం. దయచేసి #GoLocalBeVocal. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇకపై వీలైనంత వరకూ స్వదేశీ బ్రాండ్స్ మాత్రమే వాడాలని. ఇలా మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. విదేశీ వస్తువులు ఉపయోగించకుండా ఉండడం అసాధ్యమైనదే. కానీ, వీలైనంత వరకూ లోకల్ ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయండి” అని శిరీష్‌ పేర్కొన్నారు.