ఏపీలో 10,199 కొత్త కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 10,199 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,65,730కి చేరింది. ఇందులో 1,03,701 కేసులు యాక్టివ్ గా ఉండగా, 3,57,829 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

నిన్న 75 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 4200కి చేరింది. జిల్లాలవారీగా కరోనా కేసులు.. అనంతపూర్ జిల్లాలో 854, చిత్తూరు జిల్లాలో 885, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1090, గుంటూరులో 805, కడపలో 898, కృష్ణా జిల్లాలో 318, కర్నూలు జిల్లాలో 616, నెల్లూరులో 982, ప్రకాశం జిల్లాలో 926, శ్రీకాకుళంలో 717, విశాఖపట్నంలో 695, విజయనగరంలో 577, పశ్చిమ గోదావరి జిల్లాలో 836 కేసులు నమోదయ్యాయి.