ఏపీలో 10,368 కొత్త కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,368 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 84 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,139 కి చేరింది. మొత్తం 4,053 మంది మరణించారు.

ఏపీలో ఇప్పటివరకు 3,39,876 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,01,210 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే గడిచిన 24 గంటల్లోనే 9,350 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ బులెటిన్ లో పేర్కొంది.