సుకుమార్ కు పదికోట్ల అడ్వాన్స్

విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమాని ప్రకటించారు. దీనికి నిర్మాత కేదార్. హీరో బన్నీకి అత్యంత సన్నిహితుడు, కొన్ని వ్యాపారాల్లో భాగస్వామి కూడా. ఈ సినిమా కోసం సుకుమార్ కు భారీ అడ్వాన్స్ ముట్టచెప్పినట్లు టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది.

సుమారు 10 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారని, అలాగే ఇదే సినిమా కోసం మరో అయిదు కోట్ల వరకు అడ్వాన్స్ ల కింద ఖర్చు చేసారని టాక్. అంటే మరో ఏడాదిన్నర తరువాత తీయబోయే సినిమా కోసం 15 కోట్లు ఇప్పుడే ఖర్చు చేసారన్నమాట.