తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 8 నుంచి జులై 5 వరకు మిగిలిన పరీక్షలు నిర్వహించనున్నారు.  జూన్ 8న ఇంగ్లీష్ పేపర్1,  11న ఇంగ్లీష్ పేపర్ 2, 14న మ్యాథ్స్ పేపర్ 1, 17న మ్యాథ్స్ పేపర్ 2,  20న సైన్స్ పేపర్ 1, 23న సైన్స్ పేపర్ 2,  26న సోషల్ స్టడీష్ పేపర్ 1, 29న సోషల్ స్టడీష్ పేపర్ 2 నిర్వహించనున్నారు.

కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. తరగతి గదిలో 20 మంది విద్యార్థులని మాత్రమే కూర్చోబెట్టనున్నారు. జలుబు, దగ్గు ఉన్న విద్యార్థులని ప్రత్యేక గదుల్లో కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహించనున్నారు.