తెలంగాణ పోలీస్ అకాడమిలో 124మందికి కరోనా

వైద్యులు, పోలీసులు కూడా కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ పోలీస్ అకాడమీలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 124 మందికి ఈ వైరస్‌ సోకింది. అటెండర్ నుంచి డీఐజీ స్థాయి వరకు పలువురికి కరోనా సోకింది. అకాడమీలో పనిచేసే ఒక అడిషనల్ ఎస్పీ, ముగ్గురు డీఎస్పీ, నలుగురు సీసీలతో సహా అక్కడున్న మెడికల్ సిబ్బంది ఈ వైరస్‌ బారిన పడ్డారు.

అకాడమీలో 1900 కాడేట్‌లు శిక్షణ పొందుతుండగా.. వారికి త్వరలోనే పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 124 మందికి వైరస్ సోకడంతో అధికారులతో టెన్షన్ మొదలైంది. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13వేలు దాటింది.