తెలంగాణలో 1,412 కొత్త కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,412 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,001 కు చేరింది. 24 గంటల్లో 6 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,298 చేరింది.

నిన్న ఒక్కరోజే 1,221 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 2,07,326 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 20,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో30,484 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 40,17,353 కు చేరింది. అత్యధిక జీహెచ్‌ఎంసీ పరిధిలో 249 కేసులు నమోదయ్యాయ్.