తెలంగాణలో 1,417 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,417 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 264 మందికి కొత్తగా కరోనా సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,532 క్రియాశీల కేసులున్నాయి.

నిన్న ఒక్కరోజే వైరస్‌ బారిన పడిన 13 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 974కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,153కి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వైరస్‌ సోకిన వారిలో నిన్న మరో 2,479 మంది కోలుకోవడంతో కరోనాను జయించిన వారి సంఖ్య 1,27,007 చేరింది.