తెలంగాణలో 1430 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తొంది. గత 24గంటల్లో  1430 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 47,705కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 703 కేసులు నమోదుయ్యాయి.

ఈ ఒక్కరోజే 2062 మంది వైరస్‌నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 36,385 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకున్నట్లు ప్రభుత్వం బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 10,891 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు మేడ్చల్‌లో 105, సంగారెడ్డిలో 50, వరంగల్‌ అర్బన్‌లో 34, వరంగల్‌ రూరల్‌లో 20, కరీంనగర్‌లో 27, మెదక్‌లో 26, నిజామాబాద్‌లో 48, నల్గొండలో 45 కేసులు నమోదయ్యాయి.