తెలంగాణలో 1486 కొత్త కేసులు

తెలంగాణ గడిచిన 24 గంటల్లో 1,486 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,24,545కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఏడుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,282కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,891 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,02,577కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,686 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 17,208 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.