ఏపీలో 1,555 కరోనా కొత్త కేసులు

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,555 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 13 మంది చనిపోయారు. కొత్తగా నమోదైన కేసులలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు 53 మంది కాగా, ఇతర దేశాల నుంచి వచ్చినవారు ఇద్దరు. రాష్ట్రానికి చెందివారు 1500 మంది ఉన్నారు.

రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 23,814కి చేరింది. ఈ రోజు రాష్ట్రంలో కరోనాతో వీరితో కలిపి ఇప్పటివరకు 277 మంది కరోనాతో మృతి చెందారు. ఈ రోజు కరోనా నుంచి కోలుకొని ఈ రోజు మరో 904 మంది డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 10,894 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.