తెలంగాణలో 1,579 కొత్త కేసులు

తెలంగాణ గడిచిన 24 గంటల్లో 1,579 కొత్త‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,26,124కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,287కి చేరింది.

నిన్న ఒక్క రోజే 1,811 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,04,388కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,449 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 17,071 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.