ఏపీలో 1608 కొత్త కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 21,020 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 1608 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. మరో ఐదురుగు మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది.

అనంతపూర్‌, చిత్తూరు, గుంటూరు, కృష్ణ, కర్నూలు జిల్లాలో ఇద్దరు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 292కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 13,194 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 11,936మంది చికిత్స పొందుతున్నారు.