కర్ణాటకలో కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం

బ్రిటన్ లో వెలుగులోనికి వచ్చిన కొత్తరకం కరోనా వైరస్ భారత్ లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 29 కొత్త కేసులు నమోదయ్యాయ్. తాజాగా యూకే నుంచి కర్ణాటకకు వచ్చిన 18 మందిలో కొత్త కరోనా స్ట్రెయిన్ బయటపడింది. దీంతో కర్ణాటక రాష్ట్రం అప్రమత్తం అయ్యింది.

ఇంకా 185 మందికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉన్నది. కరోనాకు వ్యాక్సిన్ కు అనుమతులు వచ్చిన సమయంలోనే పెద్ద సంఖ్యలో కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడుతుంటడం కొంత ఆందోళన కలిగిస్తోంది. కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాపిస్తుందని ఇప్పటికే తేలింది. సాధారణ కరోనా వైరస్ కంటే కూడా ఈ కొత్త స్ట్రెయిన్ 70శాతం వేగంగా విస్తరిస్తోంది.

Spread the love