19,459 కొత్త కేసులు, 380 మరణాలు

భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 19,459 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా మరో 380మంది చనిపోయారు. దీంతో సోమవారం నాటికి దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 5,48,318కి చేరింది. వీరిలో ఇప్పటివరకు మొత్తం 16,475మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది.

ఇక మహారాష్ట్ర, దిల్లీలలో వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 1,64,626 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో ఇప్పటివరకు 7429 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని దిల్లీలో కొవిడ్ కేసుల సంఖ్య 83,077కి చేరగా 2623మంది చనిపోయారు.