కోటికి చేరువలో కరోనా కేసులు

కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 95 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 95,27,125 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 4,84,972 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి చికిత్స పొంది 51,75,406 మంది కోలుకున్నారు.

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 24,62,554 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,24,281 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 10,40,605 మంది కోలుకున్నారు.