దేశంలో 24,879 కొత్త కేసులు

దేశంలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయ్. గడిచిన 24గంటల్లో కొత్తగా 24,879పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశంలో తొలిసారిగా ఒక్కరోజే దాదాపు 25వేల మార్కు దగ్గరకు చేరింది.

గురువారం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 7,67,296కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అంతేకాకుండా వైరస్ బాధితుల్లో నిన్న ఒక్కరోజే 487మంది మృత్యవాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 21,129కి చేరింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 4,76,378 మంది కోలుకోగా మరో 2,69,789ల యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Spread the love