తెలంగాణ ఉద్యోగులకి గుడ్ న్యూస్

తెలంగాణ ఉద్యోగులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అలాగని బోనస్ ప్రకటించలేదు. కానీ ఈ నెల 26న దసరా సెలవుగా ప్రకటీంచింది. రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు వారికి ఈ నెల 26న (సోమవారం) దసరా సెలవుగా ప్రకటించారు. దసరా సెలవును ఈ నెల 25 నుంచి 26కు మార్చినట్లు కేంద్రం పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25ను సెలవుగా ప్రకటించింది. కేంద్రం మాదిరిగానే 26న సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. తెలంగాణ, ఏపీ బ్యాంకు ఉద్యోగుల సంఘం సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు లేఖ రాసింది. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శని, ఆది, సోమవారం మూడు రోజు కలిసి రావడంతో ప్రభుత్వ ఉద్యోగులు ఆనందాన్ని వ్యాక్తం చేశారు.