ఏపీలో 2,918 కొత్త కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 2,918 కొత్త కేసులు నమోదయ్యాయ్. 24 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,86,050కు చేరింది. ఇందులో 35065 కేసులు యాక్టివ్ గా ఉంటే, 744532 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 24 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6453కి చేరింది. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే అనంతపురంలో 218, చిత్తూరులో 380, తూర్పుగోదావరి జిల్లాలో 468, గుంటూరులో 333, కడపలో 155, కృష్ణాలో 117, కర్నూలులో 66, నెల్లూరులో 119, ప్రకాశంలో 308, శ్రీ కాకుళంలో 143, విశాఖపట్నంలో 120, విజయనగరంలో 44, పశ్చిమ గోదావరిలో 447 కేసులు నమోదయ్యాయి.