తెలంగాణ కరోనా రిపోర్ట్ : 2,932 కేసులు, 11 మరణాలు

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 2,932 కొత్త కరోనా‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,17,415 చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 799కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 28,941కి చేరింది.నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 520 ఉన్నాయి. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1580 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 87,675కి చేరింది.