ఏపీ కరోనా రిపోర్ట్

ఏపీలో గడచిన 24 గంటల్లో 295 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. అదే సమయంలో 368 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. ఆ ఒక్క మరణం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,84,171 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,74,223 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  ఇంకా 2,822 మందికి చికిత్స జరుగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 7,126కి చేరింది.

ఇక తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 45 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 39, గుంటూరు జిల్లాలో 35, తూర్పుగోదావరిలో 32 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 4 కేసులు రాగా, శ్రీకాకుళం జిల్లాలో 9, కడప జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి.

Spread the love