ఖుష్భూపై 30 ఫిర్యాదులు

ఇటీవలే  కాంగ్రెస్ నుంచి బీజీపీలో చేరిన సీనియర్ హీరోయిన్ ఖుష్భూపై 30 చోట్ల పోలీస్ కేసులు నమోదయ్యాయ్. దివ్యాంగులపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తమిళనాడులోని వివిధ జిల్లాల్లో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) బుధవారం తెలిపింది.

సోమవారం ఆమె కాంగ్రెస్‌ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ‘మానసిక వికలాంగుల’ పార్టీ నుంచి నిష్క్రమించానని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ ప్రధాన కార్యదర్శి మురళీధరన్‌ మాట్లాడుతూ రాజకీయ నాయకురాలిపై దాదాపు 30 పోలీస్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పారు. చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారన్నారు. చెన్నై, కంజిపురం, చెంగల్‌పేట, మధురై, కోయంబత్తూరు, తిరువూర్‌ తదితర ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.