బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆమెని మూడ్రోజుల పాటు విచారించారు. ఈ విచారణలో అఖిలప్రియను పోలీసులు 300 ప్రశ్నలు అడిగారు. చాలా ప్రశ్నలకు ఆమె మౌనం పాటించారు.
అయితే అఖిలప్రియ నుంచి పోలీసులు కీలక విషయాలను రాబట్టారు. కిడ్నాప్ సమయంలో ప్రవీణ్‌రావు నివాసం దగ్గర భార్గవ్‌రామ్ రెక్కీ నిర్వహించారు. కిడ్నాప్ చేసిన ముగ్గురిని భార్గవ్ ఫామ్‌హౌస్‌లో బంధించారు. బాధితుల నుంచి డాక్యుమెంట్స్‌పై సంతకాలు సేకరించినట్లు విచారణలో వెల్లడైంది. ప్రధాన నిందితులు భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
Spread the love