లాక్‌డౌన్‌.. 338 కేసులు !

కరోనా కట్టడిలో భాగంగా తెలుగు రాష్ఠ్రాలు ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ ని పట్టించుకోకుండా ప్రజలు బయట తిరగడం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించినందున ఏపీలో భారీగా కేసులు నమోదయ్యాయి.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఆకతాయిలపై 338 కేసులు నమోదు చేయడంతో పాటు 288 వాహనాలను సీజ్‌ చేసినట్లు మంత్రి నాని వివరించారు. లాక్‌డౌన్‌ విధించడంతో రాష్ట్రంలో ఏప్రిల్‌ 1 తర్వాత ఇవ్వాల్సిన రేషన్‌ను ఈ నెల 29నే ఇస్తామని నాని తెలిపారు. పేదలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏప్రిల్‌ 4న రూ.1000 చొప్పున అందజేయనున్నట్టు తెలిపారు.