ఏపీలో 3,503 కొత్త కేసులు

ఏపీలో గడచిన 24 గంటల్లో 3,503 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,89,553కి చేరాయి. ఇప్పటివరకు 7,49,676 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 33,396 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 28 మంది కరోనాతో మరణించారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,481కి పెరిగింది. తాజాగా 5,144 మందికి కరోనా నయం అయింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 524 కొత్త కేసులు గుర్తించారు.