తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 351 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,784కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,565కి చేరింది.

కరోనాబారి నుంచి నిన్న 415 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,89,784కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,756 ఉండగా వీరిలో 2,584 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు బ్రిటన్ లో బయటపడిన కొత్తరకం కరోనా స్ట్రెయిన్ తెలంగాణలోకి వ్యాపించిన సంగతి తెలిసిందే.

Spread the love