దేశంలో 37,975 కొత్త కేసులు

దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 37,975 కేసులు నమోదయ్యాయ్. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 91,77,840కు చేరింది. గడిచిన 24 గంటల్లో మరో 480 మంది కొవిడ్‌కు బలయ్యారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,34,218కి పెరిగింది. భారత్‌లో మరణాల రేటు 1.46శాతంగా ఉంది.

ఇక సోమవారం మరో 42,314 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 86,04,955 మంది వైరస్‌ నుంచి సురక్షితంగా బయటపడగా.. రికవరీ రేటు 93.76శాతానికి పెరిగింది. ప్రస్తుతం 4,38,667 యాక్టివ్‌ కేసులుండగా.. క్రియాశీల రేటు 4.78శాతానికి పడిపోయింది.

Spread the love