డేంజర్ : కోల్ కతాలో మరో కరోనా కేసు

కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. ఇప్పటికే కేరళలో మూడు కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా కోలకతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరో వ్యక్తికి నోవల్‌ కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారించారు. బ్యాంకాక్ నుంచి కోలకతా చేరుకున్న ప్రయాణికుడికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారించినట్లు విమానాశ్రయ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. దీంతో కోల్‌కతాలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది.

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు ఇండిగో ఫిబ్రవరి 6 నుంచి 25 వరకు కోల్‌కతా- గ్వాంగ్‌జౌ మధ్య తన విమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇండిగో తరువాత, చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఫిబ్రవరి 10 నుండి ఫిబ్రవరి 29 వరకు చైనాలోని కోల్‌కతా, కున్మింగ్ మధ్య విమానాలను నిలిపివేసింది. చైనా, హాంకాంగ్, సింగపూర్ బ్యాంకాక్‌ నుండి కోల్‌కతాకు వచ్చే విమాన ప్రయాణికులను జనవరి 17 నుండి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.