దేశంలో 46,791 కొత్త కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో 4 6,791 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 75,97,064కు చేరింది. గడిచిన మూడు నెలల్లో 50,000 లోపు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో 587 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,15,197 గా ఉంది.

నిన్న దేశ వ్యాప్తంగా 69,720 మంది డిశ్ఛార్జి కావడంతో.. ఇప్పటి వరకూ 67,33,329 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 7,48,538 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. దాదాపు 88.26 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో కేవలం 10.23 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. మరణాల రేటు 1.52 శాతంగా ఉందని బులిటెన్‌లో పేర్కొంది.