ఏపీలో కొత్తగా 4892 గ్రామ సచివాలయాలు

ఏపీలో జగన్ సర్కార్ గ్రామ సచివాలయాలని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం భారీ ఎత్తున ఉద్యోగాలని భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయ నిర్మాణాలని చేపడుతోంది. తాజాగా, మరో 4892 గ్రామ సచివాలయాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. మంగళవారం మంత్రి పెద్దిరెడ్ది.. ఉపాధి హామీ పథకంపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్ఘంగా మంత్రి మాట్లాడుతూ.. ఉపాధి హామీ నిధులతో గ్రామ సచివాలయాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 2781 గ్రామ సచివాలయాలకు పాలనా అనుమతులు ఇచ్చామన్నారు. కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో రేపు సమీక్ష నిర్వహిస్తామన్నారు. చేపట్టిన పనులు, పురోగతిపై అధికారులు నివేదికలు సిద్దం చేయాలన్నారు. ఇక రాష్ట్రంలో 25లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుబంధంగా ఉపాధి హామీ పనులు చేపట్టనున్నట్లు మంత్రి పెద్దిరెడ్ది తెలిపారు.