ఏపీ 497 కొత్త కేసులు

ఏపీలో కరోనా ఉద్రితి ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో నమోదయిన కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పదివేలు దాటాయి. గడచిన 24 గంటల్లో 497 కొత్త కేసులు నమోదయ్యాయి. 10 మంది చనిపోయారు. కొత్తగా నమోదయిన కేసుల్లో 448 మంది స్థానికులు కాగా, 37 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు.

ఏపీల మొత్తం కేసుల సంఖ్య 10,331కి చేరింది. మరణాల సంఖ్య 129కి పెరిగింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,423గా ఉంది. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది 4,779 మంది డిశ్చార్జ్ అయ్యారు.