దేశంలో 57,117 కొత్త కేసులు

గత 24 గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 57,117 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,95,988కు చేరింది. కొత్తగా 764 మరణించడంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 36,511కు పెరిగింది.

మొత్తం నమోదైన కేసుల్లో 5,65,103 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 10,94,374 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 64.53 శాతంగా ఉంది. ప్రస్తుతం మరణాల రేటు 2.15 శాతంగా ఉంది.