అమెరికాల్లో ఒక్కరోజే 60వేల కరోనా కొత్త కేసులు

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. అమెరికాలో బుధవారం ఒక్కరోజే 60 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

ఫ్లోరిడాలో 10 వేలు, టెక్సాస్ లో 9,500, కాలిఫోర్నియాలో 8,500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాలిఫోర్నియా, టెక్సాస్ లో కరోనా మరణాలు కూడా అత్యధికంగా సంభవించాయి. బుధవారం ఒకే రోజు 900లకు పైగా కరోనాతో మృతి చెందారు.

Spread the love