తెలంగాణ 602 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయ్. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 602 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,64,128కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,433కి చేరింది.

కరోనాబారి నుంచి నిన్న 1,015 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,51,468కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 11,227 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 8,942 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Spread the love