ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 7 సినిమాలివే.. !

కరోనా లాక్ డౌన్ తో థియేటర్స్ మూతపడ్డాయి. తిరిగి ఇప్పట్లో తెరచుకొనేలా లేవు. అసలు ఈ యేడాదిలోనే థియేటర్స్ తెరచుకుంటాయనే గ్యారెంటీ లేదు. ఒకవేళ తెరచుకున్నా జనాలు థియేటర్స్ కి వస్తారని నమ్మకం లేదు. ఈ నేపథ్యంలోనే సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 7 సినిమాలు ఓటీటీ రిలీజ్ ప్రకటించుకున్నాయి. ఇందులు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాలున్నాయి. ఇవన్నీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతున్నాయి.

కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్’, అమితాబ్ బచ్చన్ నటించిన ‘గులాబో సితాబో’, విద్యాబాలన్ నటించిన ‘శకుంతల దేవి’, జ్యోతిక, ప్రతిబన్, భాగ్యరాజ్, ప్రతాప్ పోతన్, పాండియరాజన్ నటించిన ‘పొన్ మగల్ వంధల్’, రఘు సమర్థ్ దర్శకత్వంలో రాగిని చంద్రన్, సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రు ప్రధాన పాత్రలో నటిస్తున్న కన్నడ సినిమా ‘లా’. మరో కన్నడ చిత్రం ‘ప్రెంచ్ బిర్యానీ సినిమాలు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతున్నాయ్.