దేశంలో 72,049 కొత్త కేసులు

దేశంలో కరోనా‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 72,049 కొత్త‌ కేసులు నమోదయ్యాయ్. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 67,57,132కి చేరింది. నిన్న ఒక్క రోజే 82,203 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 57,44,693కి చేరింది.

మరోవైపు కొవిడ్‌తో 986 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,04,555కి పెరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,07,883 క్రియాశీల కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 85.02 శాతం.. మరణాల రేటు 1.55 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.