ఒక్కరోజులోనే.. 75,760కేసులు, 1023 మరణాలు!

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 75,760 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. నిన్న ఒక్కరోజే మరో 1023మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు.

దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 33లక్షలకు చేరాయి. కరోనా మరణాల సంఖ్య 60,472కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో 25లక్షల మంది ఇప్పటికే కోలుకోగా, మరో 7లక్షల క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న మరో 56వేల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76శాతంగా ఉంది. దాదాపు 23శాతం యాక్టివ్‌ కేసులుండగా, మరణాల రేటు 1.8శాతంగా ఉంది.