దేశంలో కొత్త 77,266 కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 77,266 కేసులు నమోదయ్యాయి. మరో 1,075 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 33,87,501కి పెరిగింది.

మరణాల సంఖ్య 61,529కి చేరింది. ఇప్పటి వరకు 25,83,948 మంది కోలుకొని ఇళ్లకు చేరగా.. 7,42,023 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం ఒక్కరోజే 9,01,338 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.