గొర్రెలకుంట బావిలో 7 మృతదేహాలు

వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు బయటపడటం కలకలం సృష్టిస్తోంది. ఈ ఉదయం రెండు మృతదేహాలను అధికారులు వెలికితీశారు. నిన్న గొర్రెకుంటలోని బావిలో నలుగురి మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మొత్తం ఈ బావి నుంచి 7మృతదేహాలు బయటపడ్డాయి.

పశ్చిమ బెంగాల్‌ ప్రాంతానికి చెందిన మక్సూద్‌ (50), అతని భార్య నిషా(45), 22ఏళ్ల కుమార్తె, ఆమె మూడేళ్ల కుమారుడు మృతదేహాలు బావిలో తేలియాడడంతో హృదయాల్ని కలిచి వేసింది. వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా.. ? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ??అన్నది తెలియాల్సి ఉంది. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.