80 టీటీడీ సిబ్బందికి కరోనా

కరోనా మహమ్మారి దేవుళ్లని కూడా వదలడం లేదు. కరోనా ఎఫెక్ట్ తో దేశంలోనే దేవాలయాలన్నీ రెండు నెలల పాటు మూతపడిన సంగతి తెలిసిందే. అన్ లాక్ 1లో భాగంగా ఆలయాలు తెరచుకొన్నాయి. ఈ క్రమంలో తిరుమల శ్రీవారు కూడా భక్తులకి దర్శనం ఇస్తున్నారు. అయితే.. తితిదే సిబ్బంది కరోనా బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తితిదేలో మొత్తం 80 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు జిల్లా కలెక్టరు ఎన్‌.భరత్‌ గుప్తా తెలిపారు.

తిరుపతిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ‘నిత్యం 200 మంది తితిదే సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. భక్తుల ద్వారా ఉద్యోగులకు వైరస్‌ సోకినట్లు ఆధారాల్లేవు. ఇప్పటిదాకా 800 మంది భక్తులకు పరీక్షలు చేయగా అందరికీ నెగెటివ్‌ వచ్చింది.’ అని చెప్పారు.

Spread the love