ఈ నెల 10న టీమిండియా వరల్డ్ కప్

ఈ నెల 10న టీమిండియా వరల్డ్ కప్ ని అందుకోనుంది. తొలిసారి వరల్డ్ కప్ ని అందుకునే ఆనందంలో భారత క్రికెట్ అభిమానులున్నారు. 1983లో వరల్డ్ కప్ విజేతగా నిలిపిన ఘనత కపిల్ దేవ్ సొంతం. తాజాగా బాలీవుడ్ లో కపిల్ దేవ్ జీవితం ఆధారంగా ’83’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కపిల్ దేవ్ పాత్రను రణవీర్ సింగ్ పోషిస్తున్నాడు.

సోమవారం (జనవరి 6) కపిల్ దేవ్ జన్మదినం సందర్భంగా ’83’ రిలీజ్ డేటుని ప్రకటించారు. కబీర్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్ లో తమిళనటుడు జీవా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రధానంగా కపిల్ నాయకత్వంలో భారత్ కప్ విజేతగా ఎలా ఎదిగిందన్న విషయాన్ని చూపించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల టీమిండియా తొలిసారి వరల్డ్ కప్ ని అందుకోనుందని చెప్పుకొంటున్నారు.