ఏపీలో 8,846 కొత్త కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 8,846 కొత్త కేసులు నమోదయ్యాయి. 9,628 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి కాగా 69 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5,83,925 మంది కరోనా బారినపడగా 92,353 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 4,86,531 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 5,041 మంది మృతి చెందారు.