తమిళనాడులో పేలుళ్లు : 9 మంది మృతి

తమిళనాడులోని కడలూరు జిల్లా కాట్టుమన్నూర్ కోయిల్‌లో బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసింది.

మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధిచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.