తెలంగాణలో 925 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయ్. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 925 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,62,653కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,426కి చేరింది.

కరోనాబారి నుంచి నిన్న 1,367 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,49,157కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 12,070 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 9,714 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.