ఏపీలో 1.5లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య 1.50లక్షలు దాటాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,276 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసులు 1,50,209కి చేరింది. కరోనాతో ఇవాళ మరో 58 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 1,407 మంది మృతి చెందారు.

కొత్తగా మృతి చెందినవారిలో తూర్పుగోదావరిలో 8మంది, విశాఖపట్నంలో 8, గుంటూరులో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కడపలో ఒక్కరు ఉన్నారు.