షాక్ : అభినయ్’ది ఆత్మహత్యా ?

అలనాటి తార వాణిశ్రీ కుమారుడు అభినయ్ కన్నుమూశారు. ఆయన హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారని మొదట తెలిసినా.. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో అది ఆత్మహత్య అని అభినయ్ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.

డాక్టర్ విద్యను పూర్తి చేసిన అభినయ్ బెంగళూరులోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఈ మధ్యే తిరుక్కలికుండ్రంలో ఓ బంగ్లాను ఆయన కొనుగోలు చేశారు. లాక్డౌన్‌ ఉన్నందున ఎటూవెళ్లలేని పరిస్థితి. దాంతో ఫామ్‌హౌస్‌లోని ఉండిపోయారు. మానసిక ఒత్తిడికి గురయ్యుంటారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.