ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం


ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఆగ్రో-లక్నో జాతీయ రహదారిపై ఆగివున్న ప్రయివేటు బస్సుని లారీ వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. దాదాపు 31 మంది గాయపడ్డారు.

ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు దిల్లీ నుంచి బిహార్‌లోని మోతిహరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.