న్యూఇయర్ వేడుకలు : వరంగల్ లో విషాదం

న్యూఇయర్ వేడుకల సందర్భంగా అకడక్కడ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. వరంగల్ జిల్లాలోని రాయపర్తిలో నూతన సంవత్సర వేడుకలు విషాదాన్ని నింపాయి. న్యూయర్ వేడుకలు ముగించుకోని ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి బైక్ చెట్టును ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. వీరు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతులు రాయపర్తి ఎస్సీకాలనీకి చెందిన ఐత శ్రీకాంత్(23), ఐత శ్రీశాంత్(16)గా పోలీసులు గుర్తించారు.

Spread the love