అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ హంగామా

ఈఎస్‌ఐ స్కామ్ లో అరెస్టయిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన్ని ఈరోజు ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఆసుపత్రిలోనే విచారణ జరపనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచి అచ్చెన్నాయుడుని బలవంతగా డిశ్చార్జ్ చేస్తున్నారనే హంగామా మొదలైంది.

అచ్చేన్నాయుడి తరఫు లాయర్ కు ఈ సమాచారం దక్కటంతో ఆయన ఈ విషయాన్ని మిడిఒయాతో పంచుకున్నారు. రాత్రి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేసి అక్కడనుండి తరలించేందుకు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి, ఇతర పోలీసు అధికారులతో కలిసి జీజీహెచ్ ఆసుపత్రికి వెళ్లారని ఆయన పేర్కొన్నారు. అయితే అలాంటిదేమీ లేదు. అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేయలేదని ఆసుపత్రివర్గాలు క్లారిటీ ఇచ్చాయి.